జూన్ 1 నుంచి రోజూ 200 రైళ్లు
భారతీయ రైల్వే జూన్ 1 నుంచి రోజువారీగా 200 నాన్ ఏసీ రైళ్లను నడపనుంది. ఈ రైళ్ల బుకింగ్స్ త్వరలో ఆన్‌లైన్‌లో ప్రారంభమవుతాయి. ఇవి రాకపోకలు సాగించే మార్గాలు షెడ్యూల్‌ను త్వరలో వెల్లడించనున్నట్లు రైల్వేశాఖ మంగళవారం రాత్రి పేర్కొంది. చిన్న నగరాలు, పట్టణాల ప్రయాణికుల అవసరాలను ఇవి తీరుస్తాయని తెలిపింది. వీటికి రైల్వే స్టేషన్లలో టికెట్లను విక్రయించరు. దేశరాజధాని దిల్లీ నుంచి శ్రామిక్ రైళ్లతో పాటు దేశంలోని 15 గమ్యస్థానాలకు 30 జతల ప్రత్యేక ఏసీ రైళ్లు నడుపుతున్న విషయం తెలిసిందే. అలాగే శ్రామిక్ రైళ్లను రెట్టింపు చేశామని, మంగళవారం రాత్రి నుంచి 200 శ్రామిక రైళ్లు నడుపుతున్నట్లు వెల్లడించింది.